హైదరాబాద్, ఏప్రిల్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్‌ను చివరి పనిదినమైన సోమవారం అందిం ఇందులో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని, ప్రభుత్వం విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఉచిత దుస్తులు, మధ్యాహ్న భోజనం మరియు అన్ని రకాల వసతులు కల్పిస్తుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
పాఠశాల కమిటీ చైర్మన్ మరియు సభ్యులు ప్రజాప్రతినిధులు సహకరిస్తేనే పాఠశాల అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మంజుల నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ బాలకిషన్ గౌడ్, చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ సభ్యులు బాగ్యాలక్మి రాజారెడ్డి, భూమని లింగం, స్వామి, కృష్ణ ఉపాధ్యాయులు సురేందర్, సంతోష్ కుమార్, నరసింహారావు, అఖిల్, అజ్జు ప్రకాశం, మహేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.