కామారెడ్డి, ఏప్రిల్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఏవో రవీందర్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.