నందిపేట్, ఏప్రిల్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దొడ్డు రకం వడ్లను రైస్ మిల్లర్లు వెంటనే కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆర్మూర్ నియోజకవర్గ సొసైటీ చైర్మన్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌ను కలిసి సమస్యల పరిష్కరం కొరకు విన్నవించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతి చేసి పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అకాల వర్షాలు పడుతున్నందున వడ్లను జిల్లా రైస్‌మిల్ యజమానులు కొనుగోలు చేయాలని కోరారు. ఎలాంటి కడ్తలు తీయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరగా జాయింట్ కలెక్టర్ సానుకులంగా స్పందించారని సొసైటీ చైర్మన్లు వివరించారు. కార్యక్రమంలో నందిపేట్ మండల పరిధిలోని సొసైటీ చైర్మన్లు బొంకం గంగారెడ్డి, భరత్ రాజ్ రెడ్డి, వాకిడి కార్తీక్ రెడ్డి తదితరులు ఉన్నారు.