నిజామాబాద్, ఏప్రిల్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మలేరియా వ్యాధిని నిర్మూలించడానికి సమయం ఆసన్నమైనదని, ఆవిష్కరణలను ఉపయోగించుకుంటూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు 2030 నాటికి మలేరియా అంతానికి మనమందరం కంకణబద్ధులం కావాలని నిజామాబాదు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సుదర్శనం మంగళవారం ప్రపంచ మలేరియా దినం ర్యాలీని స్థానిక చంద్రశేఖర్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద జండా ఊపి ప్రారంభించారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి మాట్లాడుతూ పెద్ద మంచినీటి ఆవాసాలలో ఏనాఫీలిన్ దోమలు గుడ్లు పెడతాయని అవి లార్వాదశ తరువాత ప్రౌడ దోమలు అవుతాయని తెలిపారు. దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లా కీటక జనిత నియంత్రణ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, డాక్టర్‌లు రaాహ్నవి, శ్రీలత, సుసేన, హెచ్‌ఇవో వెంకటేష్, సలీం, ఏఎన్‌ఎంలు ఆషాలు పాల్గొన్నారు.