దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని దివ్యాంగులకు తెలియజేయునదేమనగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా 2022-2023 ఆర్ధిక సంవత్సరమునకు శారీరక వైకల్యం గల వారికి, బదిరులకు, అందులకు, మానసిక దివ్యాంగుల సహాయార్థం కింద తెలిపిన సహాయ ఉపకరణములను ఉచితముగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు కామారెడ్డి జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల శాఖ, జిల్లా సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తుల స్వీకరణ తేదిని ఈనెల 25 నుంచి మేనెల 5వ తేదీ వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని అర్హులైన దివ్యాంగ సోదర సోదరీమణులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెబ్‌సైట్‌లో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సంబందిత అన్ని ద్రువపత్రములతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »