రెంజల్, ఏప్రిల్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
వరిధాన్యాన్ని ఎప్పటికప్పుడు తేమ శాతాన్ని పరిశీలించి, రైతులకు గని సంచులను ఇచ్చి, వెంటనే తూకం వేయాలని సూచించారు. రైస్ మిల్‌లో కడతా చేపట్టినట్లు అయితే అధికారుల దృష్టికి తీసుకు వచ్చి రైతులకు లాభం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ శశిభూషణ్, ఏపీఎం చిన్నయ్య, సీసీ భాస్కర్, తస్లిమ్, రైతులు ఉన్నారు.