రెంజల్, ఏప్రిల్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సాయరెడ్డి అన్నారు.గురువారం మండలంలోని దూపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం సర్పంచ్ సాయరెడ్డి మాట్లాడుతూ.18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్ గ్లాసులు ప్రిస్క్రిప్షన్స్ గ్లాసులో మందులు మోతి బిందువు ఉన్నవారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వియోగపరుచుకోవాలని అన్నారు.
ప్రతి ఒకరికి అవసరం మేరకు ఉచిత మందులతో పాటు గ్లాసులను అందించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సాయిలు, పంచాయతీ కార్యదర్శి సాయిలు, ఆరోగ్య విస్తీర్ణ అధికారి శ్రావణ్ కుమార్, విండో చైర్మన్ భూమారెడ్డి, వైద్య సిబ్బంది, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు తదితరులున్నారు.