ఎడపల్లి, ఏప్రిల్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట గురువారం ఐకేపి వీఓఏ ల నిరవధిక సమ్మె ప్రారంభం కాగా నాలుగోవ రోజు కొనసాగింది. ఈ మేరకు నాలుగవ రోజు ఐకేపి వీఓఏలు నిర్వహిస్తున్న సమ్మెలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పోశెట్టి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం రూ.26 వేలు పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి పది లక్షలు సాధరణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించి గ్రేడిరగ్‌తో సంబంధం లేకుండా ప్రతినెల వేతనాలు వీఓఏల వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలని అలాగే విఓఏలతో ఆన్లైన్ పనులు చేయించకూడదన్నారు. విఓఏలపైన మహిళా సంఘాల ఒత్తిడి ఎక్కువగ ఉన్నందున ఎస్‌ఎచ్‌జి, వీఓ లైవ్ మీటింగ్స్ రద్దు చేయాలని, అర్హులైన వీఓఏలను, సీసీలను ప్రమోషన్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కారం దిశగా ఆలోచించాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, మండల ఉపాధ్యక్ష్యురాలు సాహెరా బాను, ప్రధాన కార్యదర్శి పోచమ్మ, కోశాధికారి గౌతమి, సహకార కార్యదర్శి మంజుల, శోభ, మాధవి, కొమురవ్వ, శిరీష, లత, పుష్ప, స్వప్న, సుజాత మండల విఓఏలు తదితరులు పాల్గొన్నారు.