బాన్సువాడ, ఏప్రిల్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నర్సరీలో పెరుగుతున్న మొక్కలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం మండలంలోని బొర్లం గ్రామంలోని గ్రంథాలయాన్ని నర్సరీని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలని హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ప్రతి ఇంటింటికీ మొక్కలు నాటే కార్యక్రమానికి కార్యచరణ ముందస్తుగా చేసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు వెంకటరామిరెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.