నిజామాబాద్, ఏప్రిల్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కానిస్టేబుల్స్ ఫైనల్ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఇంచార్జీ పోలీస్ కమీషనర్ ప్రవీణ్ కుమార్ వెల్లడిరచారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూటుమెంట్ బోర్డు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ ఫైనల్ రాత పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 1గంట వరకు నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ వ్యాప్తంగా మొత్తం అభ్యర్థులు 5,285 మంది రాత పరీక్షకు మొత్తం 12 పరీక్ష కేంద్రాలు నిజామాబాద్ టౌన్‌లో కేటాయించడం జరిగిందని సిపి తెలిపారు. పరీక్ష కేంద్రాలను సిపి ప్రవీణ్ కుమార్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. మొత్తం 5,285 అభ్యర్థులకు గాను 5,237 అభ్యర్థులు హాజరు కాగా 48 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 99.09 శాతం హాజరు నమోదయిందని సిపి ప్రవీణ్ కుమార్ తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగింది. పరీక్ష కేంద్రాలు రీజినల్ కో-ఆర్డినేటర్ గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ పి.రామ్ మోహన్ రెడ్డి, నిజామాబాద్ నోడల్ ఆఫీసర్ అదనపు పోలీస్ కమీషనర్ జి. మధుసుదన్ రావు సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు డిసిపి (ఎ.ఆర్) గిరిరాజు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, ఎ.ఆర్, సి.టి.సి నారాయణ, సంతోష్, శ్రావణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీశైలం, అదనపు రీజినల్ కో-ఆర్డినేటర్ డా. కుమార స్వామి, ఐ.టి సెల్ సిబ్బంది, పరీక్షా కేంద్రాల ఛీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.