కమ్మర్పల్లి, ఏప్రిల్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం వద్ద ఏడవ రోజు వివోఎలు సమ్మెలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల వివోఎలు నోటికి చేయిపెట్టుకొని మౌనంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వివోఏల మండల అధ్యక్షుడు సుభాష్ మాట్లాడుతూ సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, 18 వేల వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని లేనిపక్షంలో సమ్మె ఉదృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో విజయ, జ్ఞానవతి, రాజశ్రీ, రజిత, అనూష, మధురిమా మండల వివోఏలు పాల్గొన్నారు.