డిచ్పల్లి, జూన్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో బోధనా, పరిశోధనా పరంగా విద్యా ప్రామాణికతను పెంచి, అభివృద్ధి పథంలో నడపాలని ప్రముఖులు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ను కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ మాజీ కార్పోరేటర్ చాంగుబాయి, డిచ్పల్లి తాండా సర్పంచ్ ప్రమీల వీసీని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
విశ్వవిద్యాలయ ఏర్పాటులో తాండావాసులు తమ భూములు కోల్పోయిన విషయాన్ని వీసీకి వివరించారు. అటువంటి వారికి విశ్వవిద్యాలయం ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నదని గుర్తుచేశారు. భవిష్యత్తులో కూడా విద్యావంతులైన వారికి సహాయసహకారాలు కల్పించాలని కోరారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి తమవంతు కృషికి సహకరిస్తామని ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ భర్త పండిత్ వినితా పవన్ కుమార్, వైస్ – చైర్మన్ షేక్ మున్నూబాయి, కౌన్సిలర్స్ అబ్దుల్ రహమాన్, తలారి చందర్, ఎఎంసి డైరెక్టర్ సొన్న నర్సింలు, పెర్కిట్‌కు చెందిన నల్ల మోహన్ రెడ్డి వీసీని మర్యాద పూర్వకంగా కలిసి తెలిపారు.