కామారెడ్డి, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్యవివాహాలను రూపుమాపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం బాల రక్షా భవన్ కన్వర్డేషన్ మీటింగ్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. (గ్రామాల్లో ఉన్న అనాధ పిల్లల వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు సేకరించాలని సూచించారు.
అనాధ పిల్లలకు (ధ్రువీకరణ పత్రం వచ్చిందా లేదా తెలుసుకోవాలని తెలిపారు. (ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో అనాధ పిల్లల కోసం సీట్లు ఉంటాయని చెప్పారు. అనాధ పిల్లలు వసతి గృహాల్లో ఉండి ఉన్నత విద్యను పూర్తిచేసే విధంగా అధికారులు చూడాలని పేర్కొన్నారు. ఎవరైనా పిల్లలను భిక్షాటన చేయిస్తే వారిని పట్టుకుని చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పదవ తరగతి పూర్తి చేసిన అనాధ బాలికలు పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని అనాధ బాలికలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ అన్యోన్య, జిల్లా బాలల అభివృద్ధి అధికారిని స్రవంతి, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వెంకటేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.