కామారెడ్డి, మే 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యుత్తును పొదుపుగా వాడి ఆర్థికంగా బలపడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం విద్యుత్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
విద్యుత్తును అదా చేయుటకు వినియోగదారులు పాటించవలసిన సూచనలు విద్యుత్ అధికారులు అవగాహన సదస్సుల ద్వారా తెలియజేయాలని తెలిపారు. నేటి విద్యుత్ అదా రేపటి విద్యుత్తు మిగులుకు నాంది పలుకుతోందని చెప్పారు.
విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి భద్రత సూచనలు పాటించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్ కో ఎస్సీ రమేష్ బాబు, డిఈ సాలియా నాయక్, వెంకట రంగయ్య, ఏ డి ఈలు జవహర్ నాయక్, మల్లేష్, ఎఈ ప్రభాకర్, ధర్మారెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.