డిచ్‌పల్లి, మే 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లోని ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో గత 23 సంవత్సరాల బోధన అనుభవం గల ప్రొఫెసర్ నిర్మల దేవిని తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టర్‌గా వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ నియమించారు.
బుధవారం సాయంత్రం ప్రొఫెసర్ నిర్మల దేవి రిజిస్టర్, తెలంగాణ యూనివర్సిటీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రొఫెసర్ నిర్మలాదేవికి పరిశోధనలో, పరిపాలనలో విశేషానుభవం ఉందని వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. ప్రొఫెసర్ నిర్మలాదేవి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారు. ప్రొఫెసర్ నిర్మలాదేవి మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీని అభివృద్ధి పథంలో ఉంచడానికి తమ వంతు కృషి చేస్తానని, పరిశోధనకు పెద్దపీట వేస్తానని తెలిపారు.
త్వరలోనే తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా విసీ తెలిపారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థుల, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సహకారంతో తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతానని ప్రొఫెసర్ నిర్మలాదేవి తెలిపారు.