కామారెడ్డి, మే 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం యాసంగి ధాన్యం కొనుగోళ్లపై బాన్సువాడ నియోజకవర్గం మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవాలని తెలిపారు. తడిసిన ధాన్యం ను తీసుకోకపోతే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
లక్ష్యానికి అనుకూలంగా మిల్లింగ్ చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిసిన ధాన్యాన్ని సహకార, వ్యవసాయ అధికారులు అంచనా వేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచర్ల లింగం, ప్రతినిధులు పాల్గొన్నారు.