ఆర్మూర్, మే 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తన సొంత పట్టా స్థలంలో వేసుకున్న కాంపౌండ్ వాల్‌ను కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కూల్చివేశారని బాధితుడు గంగాచరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు చరణ్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు సమీపంలో 33వ వార్డు సర్వేనెంబర్ 230 లో తన 500 గజాల స్థలంలో ప్రికాస్ట్ వేసుకోవడం జరిగిందని తెలిపారు.
రెండు రోజుల క్రితం ఓ కులానికి చెందిన మూడు పంతల వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వచ్చి ప్రికాస్ట్ పూర్తిగా కూల్చివేశారని, తనను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎటువంటి అనుమతి లేకుండా, పోలీసుల సమక్షంలోనే ప్రికాస్టును కూల్చివేశారని తెలిపారు. ప్రికాస్ట్ కూల్చివేసిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు.
2019 వ సంవత్సరంలో నుండే 230 సర్వేనెంబర్ లోగల 500 గజాల స్థలం తన పేరుపైనే ఉందని, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు ధృవీకరించి ఇచ్చిన సర్టిఫికెట్లు సైతం ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ చట్ట విరుద్ధంగా తన సొంత స్థలంలో వేసుకున్న కాంపౌండ్ కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని లేని యెడల ఆత్మహత్యనే శరణ్యమని అయన మీడియాతో కన్నీటిపర్యంతమయ్యారు.