కామారెడ్డి, మే 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూనియర్ పంచాయతీ అధికారులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం అందజేశారు. జూనియర్ పంచాయతీ అధికారులు రెగ్యులర్ చేయాలని ఎంత మోర పెట్టుకున్న చేయడం లేదని, మూడు సంవత్సరాల పాటు ప్రొవిషన్ తర్వాత ప్రెజర్ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ రెగ్యులర్ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
నెగిటివ్ కట్ ఆఫ్ మార్కులు ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాసి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగంలో తీసుకొని రెగ్యులర్ చేయకుండా తమపై నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సమ్మె బాట పట్టామని వారన్నారు. కార్యక్రమంలో తాడ్వాయి మండల్ కోఆర్డినేటర్ రమేష్, మాచారెడ్డి కోఆర్డినేటర్ దర్శన్, కామారెడ్డి కోఆర్డినేటర్ గణేష్, రామారెడ్డి కోఆర్డినేటర్ లావణ్య, భానుప్రియ, అనిల్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.