ఆర్మూర్, మే 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూరు పట్టణంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె ఏడవ రోజు సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో డివిజన్ స్థాయి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేపట్టారు. అంతకుముందు ఇటీవల మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మాపట్ల ప్రభుత్వం వెంటనే స్పందింది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ చేయాలని జిల్లా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల యూనియన్ అధ్యక్షుడు అనిల్ అన్నారు. ప్రభుత్వం తమ పై చిన్న చూపు చూడకుండా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అదేవిధంగా ఓపిఎస్లను జెపిఎస్లుగా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్మూరు మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడు దేవేందర్, సురేష్. రమ, సుమలత, సాయి కృష్ణ, నవీన్, ప్రసాద్ తదితరులున్నారు.