నిజామాబాద్, మే 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సి) ద్వారా ఈ నెల 8, 9 వ తేదీలలో జరుగనున్న రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. రాత పరీక్ష కోసం నిజామాబాద్ జిల్లాలో మూడు సెంటర్ లను ఏర్పాటు చేశామని వివరించారు. ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5 గంటల వరకు రెండు సెషన్‌లలో రాత పరీక్ష జరుగుతుందని తెలిపారు.
వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు హాల్ టిక్కెట్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ వెంట సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్, స్మార్ట్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకారణాలేవీ వెంట తేకూడదని అన్నారు. ఉదయం సెషన్ పరీక్షకు సంబంధించి 9.30 గంటలు, మధ్యాహ్నం సెషన్ కు సంబంధించి 2 గంటల తరువాత వచ్చిన వారిని పరీక్షా కేంద్రం లోనికి అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ : 08462 – 220183 ని సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు.