అభివృద్దే మన ఆయుధం

ఆర్మూర్‌, మే 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమగ్రాభివృద్ధి, సబ్బండవర్గాల సంక్షేమమే మన ఆయుధమని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గం ఆర్మూర్‌, ఆలూరు మండలాల్లోని పలు గ్రామాల బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులతో శనివారం జీవన్‌ రెడ్డి అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించారు. ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌, ఇస్సాపల్లి, గగ్గుపల్లి, మిర్ధపల్లి, ఆమ్దాపూర్‌, రాంపూర్‌, మంథిని, కోమన్‌పల్లి, ఖానాపూర్‌, పిప్రి, సుర్బిర్యాల్‌, చేపూర్‌, దేగాం గ్రామాల బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయా గ్రామాల వారీగా ఆయన అభివృద్ధి పనులను సమీక్షించారు.

మాక్లూర్‌ మండలంలోని వివిధ గ్రామాల నేతలతోనూ ఆయన విడివిడిగా సమావేశమై ఆయా గ్రామాల ప్రగతిపై రివ్యూ చేశారు. అలాగే ఆలూరు మండల బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతోనూ జీవన్‌ రెడ్డి సమావేశమై అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలన్నీ అభివృద్ధితో కళకళలాడాలని దిశా నిర్దేశం చేశారు. గతంలో చేపట్టిన పనుల పురోగతి ఎలా ఉంది?. చేపట్టిన పనులన్నీ కాలపరిమితిలోగా పూర్తి కావాలె, అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దని, మీ గ్రామాల్లో కొత్తగా చేపట్టాల్సిన పనులేమైన ఉన్నాయా? అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు నిర్మిద్దాం అని, ఏ గ్రామానికైనా సీసీ రోడ్లు, డ్రైనేజీల అవసరం ఉందా?.
ఉంటే చెప్పండి వెంటనే నిధులు మంజూరు చేస్తా అన్నారు.

వైకుంఠ దామాలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా? ప్రకృతి వనాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలె, మీ గ్రామాల్లో క్రమం తప్పకుండా చెత్త తొలగిస్తున్నారా? చెత్త తొలగించే ట్రాక్టర్లు ఎలా నడుస్తున్నాయి? ఏ గ్రామంలోనైన విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులున్నాయా? మిషన్‌ భగీరధ మంచినీటి సరఫరా ఎలా ఉంది? అర్హులైన వారందరికీ పెన్షన్లు వస్తున్నాయా? ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుబీమా చెక్కులు అందించాలి. ప్రతిష్టాత్మకంగా ‘‘మన ఊరు-మనబడి’’ అమలు జరగాలి, గ్రామాలభివృద్ది, ప్రజా సంక్షేమమే మన లక్ష్యం అన్నారు.

గతంలో ఆర్మూర్‌ ఎట్లుంది? ఇప్పుడెట్లుందన్నదానిపై చర్చ జరగాలని, అభివృద్ధిలో సాటిలేనిమేటి అర్మూర్‌ అని, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్మూర్‌ను రెవెన్యు డివిజన్‌ అయిందని, ఆలూరు, డొంకేశ్వర్‌ కొత్త మండలాలుగా ఏర్పాటయ్యాయన్నారు. అంబేద్కర్‌ చౌరస్తా ను సుందరీకరించామని, సిద్ధులగుట్టకు రూ. 20 కోట్లతో ఘాట్‌ రోడ్డు నిర్మాణం జరిగిందని, ఈ ఘాట్‌ రోడ్డుకు సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటైందని, సిద్ధులగుట్టను అద్భుతమైన దివ్య క్షేత్రంగా, గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దడానికి అనేక నిర్మాణాలు జరుగుతున్నాయని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆర్మూర్‌- నిజామాబాద్‌, ఆర్మూర్‌-ఆలూరు- ఇలా దాదాపు 9బైపాస్‌ రోడ్లు వచ్చాయని, మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల తో మంచినీళ్లు ఇస్తున్నామని, మిషన్‌ కాకతీయ ద్వారా 200 కు పైగా చెరువులు బాగు చేశామని, ఎకరానికి పది వేల చొప్పున రైతు బంధు పెట్టుబడి ఇస్తున్నామన్నారు. పంటలను ప్రభుత్వమే కొంటున్నదని,
ఏ కారణం చేతనైన రైతులు మరణిస్తే రైతుబీమా ద్వారా పది రోజుల్లోగా 5లక్షల రూపాయల చొప్పున బీమా సొమ్ము ఆ కుటుంబాలకు అందిస్తున్నామని, 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు.

కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ ద్వారా పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేస్తున్నామని, ఆర్మూర్‌కు వంద పడకల ఆసుపత్రిని సాధించుకున్నామని, ఇక్కడ ఇప్పటికే 25వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగి ఒక్కో తల్లికి 50వేల రూపాయల చొప్పున ఖర్చు తప్పిందన్నారు. 25 వేల మందికి పైగా అనారోగ్య బాధితులకు సీఎం ఆర్‌ ఎఫ్‌, ఎల్‌ వో సీ చెక్కులు ఇప్పించామని, పంచగూడ వంతెన కట్టించి రెండు జిల్లాల మధ్య దూరం తగ్గించుకున్నామని, ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌ ను తీర్చి దిదిద్దుకున్నామని, నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాల వారికి 200కు పైగా భవనాలకు నిధులిచ్చామన్నారు. వాటిలో దాదాపు 10 మల్టీ పర్పస్‌ కమ్యూనిటి హాళ్ల నిర్మాణానికి కోట్లాది రూపాయలను మంజూరయ్యాయని, 17 వందల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల ను నిర్మించామని, సొంత స్థలాలు ఉన్న మరో మూడు వేల మందికి ఇండ్లు కట్టుకోవడానికి మూడు లక్షల చొప్పున ఇస్తున్నామన్నారు.

నియోజకవర్గ వ్యాప్తంగా తళతళ మెరిసే రోడ్లు వేశామని, డ్రైనేజీలను ఆధునీకరించామని, పల్లె ప్రగతి ద్వారా పల్లెలన్నీ ప్రకృతి వనాలు, నర్సరీలు, సీసీ రోడ్లు, సకల సౌకర్యాలతో వైకుంఠ దామాలు, చెత్తను తొలగించే ట్రాక్టర్లు, పరిసరాల పరిశుభ్రత, మనఊరు-మన బడి ద్వారా పాఠశాలల అభివృద్ధి వంటి పనులతో కళకళ లాడుతున్నాయి’’ అని జీవన్‌ రెడ్డి పేర్కొంటూ ‘‘ఇవన్నీ ఇచ్చింది కేసీఆర్‌. తెచ్చింది నేను అన్నారు. ఈ అభివృద్ధి , సంక్షేమ పథకాల గురించి పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని, మనమంతా కష్టపడి మూడోసారి బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చుకుందామన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణపై కక్ష గట్ట్ణాయని, ఈ రెండు పార్టీలకు ఓటేస్తే తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని, బీఆర్‌ఎస్‌ మాత్రమే తెలంగాణ రక్షణ కవచం. అభివృద్ధికి అసలైన అడ్రస్‌ ఆర్మూర్‌ అని మరోసారి గుర్తుచేశారు. రూ.2500 కోట్లతో ఆర్మూర్‌ నియోజక వర్గాన్ని అభివృద్ధి పర్చామని, మీ దీవెనెలతో హ్యాట్రిక్‌ సాధిస్తా’’అని జీవన్‌ రెడ్డి చెప్పారు.

బీఆర్‌ఎస్‌ నేత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు మార భాజన్న మాతృమూర్తి ఇటీవల స్వర్గస్థులైన సందర్భంగా శనివారం జీవన్‌ రెడ్డి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »