కామారెడ్డి, మే 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం గర్గుల్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. ధాన్యం తేమశాతాన్ని పరిశీలించారు. పరిశుభ్రమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రానికి తెచ్చి విక్రయించాలని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని చెప్పారు.
ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రంలో కల్పిస్తున్న సౌకర్యాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్, అధికారులు పాల్గొన్నారు.