పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, మే 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజివ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 వినతులు అందాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు ఆదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్‌, జిల్లా పరిషత్‌ సీఈఓ గోవింద్‌, డీ.పీ.ఓ జయసుధలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు.

ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు సమాచారం తెలియజేస్తూ, ప్రజావాణి సైట్‌లో వివరాలు అప్లోడ్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులుపాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »