హైదరాబాద్, మే 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని బోధన్ నుండి మద్నూర్ వయా రుద్రూర్ వరకు (ఎన్‌హెచ్-63) 38 కి.మీ పొడవు గల డబుల్ లేన్ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా ఎన్‌హెచ్‌ఏఐ మంజూరుకు కృషి చేసిన జహీరాబాద్ ఎంపి బి.బి పాటిల్‌ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు ఎంపి చూపిన ప్రత్యేక చొరవ పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ఈ 38 కి. మీ డబుల్ లేన్ రోడ్డు 750 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డుగా అభివృద్ది చెందనుంది. ఈ రోడ్డు మంజూరు కోసం ఎంపి బి.బి పాటిల్ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి పలు మార్లు లేఖలు రాసి, పలు దఫాలు ఆయన్ను ప్రత్యేకంగా కలిసి రోడ్డు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎం.పి పాటిల్ విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ శాఖ నాలుగు లేన్ల రోడ్డు మంజూరుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఆ శాఖ డిజికి ఆదేశాలతో కూడిన లేఖ రాసింది.