కామారెడ్డి, మే 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్లూర్ గ్రామానికి చెందిన హర్షియా (21) గర్భిణి స్త్రీకి రక్తహీనతతో ఓ ప్రైవేటు వైద్యశాలలో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని చెన్నబోయిన గంగరాజు గురువారం వి.టి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
వేసవికాలం కావడం వలన రక్తనిధి కేంద్రాలలో రక్తనిల్వలు తగ్గిపోవడం జరిగిందని యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడాలని అన్నారు. రక్తదానం చేసిన రక్తదాతకు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డెవలంట్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు,జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాజంపేట్ వైస్ చైర్మన్ చెన్నబోయిన ప్రసాద్ టెక్నీషియన్లు ఏసు గౌడ్, చందన్ పాల్గొన్నారు.