కామారెడ్డి, మే 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి 10 జిపిఎ సాధించిన ఇద్దరు విద్యార్థులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.
ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని పేర్కొన్నారు. లింగంపేట మైనారిటీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదివిన షాభాజ్ , కామారెడ్డి మైనారిటీ బాలికల పాఠశాలలో పదవ తరగతి చదివిన గౌసియా 10 జిపిఎ సాధించారు. కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్, రీజినల్ లెవెల్ కౌన్సినర్ ఏం.ఎ. బషీర్, విజిలెన్స్ అధికారులు మహమ్మద్ హైమద్ఉద్దీన్, షేక్ హైమద్ జియ, ప్రిన్సిపల్ వెంకటరమణ, ప్రణీత, అధికారులు పాల్గొన్నారు.