నందిపేట్, మే 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలలో భాగంగా జిల్లా ఇంచార్జి పోలీస్ కమిషనర్ సి.హెచ్ ప్రవీణ్ కుమార్ సూచనల మేరకు శుక్రవారం నందిపేట్ మండలానికి సంబందించిన ఆటో డ్రైవర్‌లకు మై ఆటో మై సేఫ్టీ అంశంపై రోడ్డు భద్రత ట్రాఫిక్ చట్టాలు మరియు రహదారి భద్రతపై నందిపేట్ పోలీసుల అధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించారు.
కార్యక్రమంలో ఎస్‌ఐ 1 సల్ల శ్రీకాంత్ మాట్లాడుతూ వాహనాలు ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఓవర్‌లోడ్ ప్యాసింజర్‌తో ఓవర్ స్పీడ్‌గా వెళ్లరాదని సూచించారు. రోడ్డు భద్రతకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ట్రాఫిక్ చట్టాలు, నియమ నిబంధనలు, ఇన్సురెన్స్ లేని వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్ధాలు వివరించారు. రాంగ్ పార్కింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఆటో అడ్డల వద్ద గొడవలు చేయవద్దని మందలించారు. సీరియల్‌గా ఆటోలు పెట్టుకొని సీరియల్ తీయాలని, ఆర్‌టిసి పరిసర ప్రాంతాలకు వెళ్లవద్దని ఆర్‌టిసి ప్రయాణికులకు ఇబ్బంది చేయవద్దని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ 2 అరిఫుద్దీన్, పోలీస్ సిబ్బంది, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.