ఆర్మూర్, మే 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఆలూర్ గ్రామంలో ఆలూర్ మండల స్థాయి చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీలను ఆలూర్ మండల పరిషత్ అధ్యక్షులు పస్కా నర్సయ్య, మాక్లూర్ మండల పరిషత్ అధ్యక్షులు మస్త ప్రభాకర్, ఆలూర్ గ్రామ సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. క్రీడా పోటీలు 15, 16, 17 తేదీలలో ఆలూర్ మైనారిటీ కాలేజ్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించబడుందని, ఇట్టి పోటీలలో గెలుపొందిన అభ్యర్థులు జిల్లా స్థాయిలో పాల్గొంటారని తెలిపారు.
కావున ఆసక్తి గల క్రీడాకారులు వెంటనే తమ పేర్లను ఆలూర్ మైనారిటీ కాలేజ్ ప్రాంగణానికి వెళ్లి నమోదు చేసుకోగలరని తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ జడ్పిటిసి సభ్యుడు సంతోష్, దేగాం ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, డీకంపల్లి సర్పంచ్ భోజన, గుత్ప సర్పంచ్ చిన్నయ్య చిన్నారెడ్డి, ఆర్మూర్ ఎంపీడీవో శ్రీనివాస్, మాక్లూర్ ఎంపీడీవో క్రాంతి, ఎంఈఓ, తాసిల్దార్ దత్తాత్రేయ, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామస్తులు, క్రీడాకారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.