విత్తనాల పంపిణీకి ముందస్తు ప్రణాళిక

కామారెడ్డి, మే 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు.

మంగళవారం హైదరాబాద్‌ లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ శాఖామాత్యులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి డి.జి.పి. అంజనీ కుమార్‌, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, పోలీస్‌ శాఖ ఉన్నత అధికారులతో కలిసి వానాకాలం సీజన్‌ ముందస్తు ఏర్పాట్లపై వ్యవసాయ అధికారులు, టాస్క్‌ ఫోర్స్‌ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్‌ వీడియో సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఏఎస్పీ అన్యోన్య, ఇంచార్జ్‌ జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

లివ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడారు.లి రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు, కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. గడిచిన 9 ఏళ్లలో వ్యవసాయ రంగానికి దాదాపు రూ.4.5 లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దేశంలో మన కంటే రెండు, మూడు రెట్లు పెద్ద రాష్ట్రాల్లో సైతం ఇంత భారీగా ఖర్చు చేయలేదని అన్నారు.

తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల విధానాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని, రైతులకు ఎటువంటి ఇబ్బందులూ రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సమయానికి అందించడంతో పాటు పంట దిగుబడి అధికంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

వానాకాలం సీజన్‌ కు సంబంధించి రైతులకు అవసరమైన మేరకు విత్తనాలు, ఎరువుల ను స్టాక్‌ ఉంచుకోవాలని, ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగా ప్రస్తుత కాలంలో నకిలీ విత్తనాలు మార్కెట్‌ లో దాదాపు మాయమయ్యాయి. అక్కడక్కడ ఉన్న కొన్ని నకిలీలను పూర్తిగా అరికట్టాలని, అమాయకులకు ఇబ్బంది కలిగించరాదని, క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించి పక్క రాష్ట్రాల నుంచి వచ్చే నకిలీ విత్తనాలు, ఎరువులపై దృష్టి పెట్టి పకడ్బందీగా నియంత్రించాలని అన్నారు.

దేశంలో ఉన్న విత్తన అవసరాలలో దాదాపు 60 శాతం మేర తెలంగాణ నుంచి సరఫరా చేస్తున్నామని, దేశానికి విత్తన బాండాగారంగా తెలంగాణ ఆవిర్భవించిందని తెలిపారు. తెలంగాణలో ఉన్న విత్తన ఉత్పత్తి పరిశ్రమకు ఇబ్బంది కలగకుండా, నకీలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌ పోస్ట్‌ ఏర్పాటు చేసి నిఘా పెంచాలని మంత్రి తెలిపారు.

లివీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులతో మాట్లాడారు.లి నకీలి విత్తనాలు అరికట్టడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పత్తి నకిలీ విత్తనాలను బట్ట సంచులలో తీసుకొని వస్తున్నారని, హెచ్‌.టి. కాటన్‌ పట్ల చట్టబద్దమైన ఆమోదం లేదని, వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, తనిఖీ సమయంలో టెస్ట్‌ కిట్స్‌ వెంట ఉంచుకోవాలని, రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు పాటించేలా చూడాలని తెలిపారు.

మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి గారి సూచనల ప్రకారం వచ్చే వానాకాలంలో పచ్చి రొట్టె ఎరువుల కోసం 7,125 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో ఉన్న టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అనుమానిత ప్రదేశాలలో వెంటనే శాంపిల్స్‌ చెక్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

విత్తన డీలర్లు దుకాణాల్లో తప్పనిసరిగా లైసెన్స్‌ ప్రదర్శించాలని, విత్తనాల విక్రయ బిల్లు పూర్తి వివరాలతో అందించాలని, స్టాక్‌ రిజిస్టర్‌ నిర్వహణ, ఫారం డీ సమర్పణ, లైసెన్స్‌ రెన్యువల్‌ చేయడం, షాపు మార్పు వివరాలు లైసెన్స్‌లో నమోదు వంటి అంశాల పై అధికారులు విత్తన డీలర్లకు, వ్యాపారస్థులకు సమాచారం అందించి సవరించేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు.

జిల్లాలో ఆకస్మిక తనీఖీల సమయంలో గడువు తేది ముగిసిన విత్తనాలు అమ్మడం, లైసెన్స్‌ లేకుండా విక్రయాలు చేపట్టడం, హెచ్‌.టీ పత్తి విత్తనాల అమ్మకం, లైసెన్స్‌ ఇతరులకు అందించి విక్రయాలు చేపట్టడం, నకిలీ విత్తనాలు ఉండటం వంటి అంశాల పట్ల కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు, టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు క్షేత్రస్థాయిలో రైతుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారంతెలుసుకుంటూ నకీలీ విత్తనాల పై చర్యలు తీసుకోవాలని అన్నారు. చేపల, గేదెల పెంపకం, ఆయిల్‌ ఫామ్‌ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »