ఎడపల్లి, మే 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట ఐకేపి వీఓఏల నిరవధిక సమ్మె ప్రారంభం కాగా బుధవారం 24వ రోజు సైతం కొనసాగింది. ఈ మేరకు బుధవారం ఐకేపి వీఓఏలు నిర్వహిస్తున్న సమ్మెలో కార్యాలయం ముందు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పోశెట్టి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం రూ.26 వేలు పిఎఫ్ఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి పది లక్షలు సాధరణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించి గ్రేడిరగ్తో సంబంధం లేకుండా ప్రతినెల వేతనాలు వీఓఏల వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలని అలాగే విఓఏ లతో ఆన్లైన్ పనులు చేయించకూడదన్నారు. విఓఏ ల పైన మహిళా సంఘాల ఒత్తిడి ఎక్కువగ ఉన్నందున ఎస్ఎచ్ జి, వీఓ లైవ్ మీటింగ్స్ రద్దు చేయాలని,అర్హులైన వీఓఏలను, సీసీలను ప్రమోషన్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కారం దిశగా ఆలోచించాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, మండల ఉపాధ్యాక్ష్యులు సాహెరా బాను, ప్రధాన కార్యదర్శి పోచమ్మ, కోశాధికారి గౌతమి, సహకార కార్యదర్శి మంజుల, శోభ, మాదవి, కొమురవ్వ, శిరీష, లత, పుష్ప, స్వప్న, సుజాత, మండల విఓఏలు తదితరులు పాల్గొన్నారు.