ఎడపల్లి, మే 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలో బుధవారం నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ చేపడతామని ఎడపల్లి మండల ప్రత్యేక అధికారి నందకుమారి, ఎంపీడీఓ గోపాల కృష్ణ తెలిపారు. బుధవారం గ్రామాల్లోని అన్ని వీధుల్లో చెత్తాచెదారం తొలగించాలనే ఆదేశాల మేరకు పలు గ్రామాల్లో రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రపరచారు. కానీ మరికొన్ని గ్రామాల్లో ఆ కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు కనబడలేదని పలువురు ఆరోపించారు.
అంతే కాకుండా గురువారం మురుగు కాలువలు శుభ్రం చే యాలని, శుక్రవారం డ్రైడే పాటించాల న్నారు. ఇంటి ఆవరణలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని, శనివారం దోమల లార్వాలు నాశనం చేసేలా స్ప్రే చేయాలని, ఆదివారం ఇంటింటా ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టేలా అవగాహన కల్పించాలని, సోమవారం నిరుపయోగ బావులు, బోర్‌బావులు పూడ్చివేయాలని, మంగళవారం స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా గ్రామంలోని ముఖ్య కూడళ్లలో ప్రజల అవగాహన కోసం వాల్‌పెయింటింగ్ వేయించాలని వీటన్నింటిని పగడ్బందిగా నిర్వహించడం జరుగుతుందని, పలు గ్రామాల్లో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు.