జూలై 22 నుంచి బి.ఎడ్‌. ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, జూన్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌/ బ్యాక్‌ లాగ్‌ / ఇంఫ్రూవ్‌ మెంట్‌, రెండవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ / ఇంఫ్రూవ్‌ మెంట్‌ థియరీ పరీక్షలకు జూలై 22 నుంచి 27 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు రివైస్డ్‌ – షెడ్యూల్‌ విడుదల చేశారు.

కావున బి.ఎడ్‌. కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో కొవిద్‌ – 19 నిబంధనలకు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్‌ ధరించడం, ఎవరికి వారే శానిటైజర్‌, వాటర్‌ బాటిల్‌ వంటివి వెంట తెచ్చుకోవాలని ఆదేశించారు. 6 అడుగుల భౌతిక దూరం నియమంతో మెలగాలని సూచించారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ సంప్రదించగలరని సూచించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »