కామారెడ్డి, మే 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో కిశోర బాలికలలో రక్తహీనత నివారణకు, బాల్యవివాహాల నిర్మూలనకు పనిచేయటానికి వచ్చిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, యూనిసెఫ్ సంస్థ ప్రతినిధులకు జిల్లా అధికారులు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం బాల్యవివాల నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. కిశోర బాలికలలో రక్తహీనత నివారణకు కార్యచరణ ప్రణాళికను రూపొందించాలని తెలిపారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, యునిఎస్‌ఎఫ్ సమస్త ప్రతినిధులు కృష్ణ, విద్యాలత కిశోర బాలికలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.