కామారెడ్డి, మే 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణానికి చెందిన కోలా వేణుగోపాల్‌కు శనివారం తమిళనాడులోని హోసూర్‌లో ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటి ఆధ్వర్యంలో జరిగిన కాన్వకేషన్ కార్యక్రమంలో తమిళనాడు మాజీ ఎమ్మెల్యే డా. కె. ఏ. మనోకరణ్, ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ ఫౌండర్ ఏం. జినురామ శర్మ స్వామీజీ, ఇంటర్నేషనల్ చైల్డ్, కన్నడ ఫిలిమ్ యాక్టర్ హెచ్. ఏం. మీనాక్షి చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.
వేణుగోపాల్ సోసియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ నందు తెలంగాణా రాష్ట్ర వైస్ ఛైర్మెన్ గా ప్రస్తుతం పని చేస్తున్నారు. మానవ హక్కుల పరిరక్షణ తో ఈయన ఎన్నో సామజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సందర్బంగా వేణుగోపాల్ మాట్లాడుతూ తాను చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను యూనివర్సిటి వారు గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.
గౌరవ డాక్టరేట్ రావడంతో నా పైన మరింత బాధ్యత పెరిగిందన్నారు. తాను చేసే సామాజిక సేవా కార్యక్రమాల్లో భార్య కోలా వాణి, కూతురు కోలా ఆధ్య సహకారం చాలా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి నుండి మరింత చురుగ్గా సామజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. తనకు ఇంతటి గొప్ప డాక్టరేట్ రావడానికి సహకారం, కృషి చేసిన వారికి, ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు.
ఈ సందర్భంగా కామారెడ్డి విఐపి సిండికేట్ సభ్యులు రామ్ రెడ్డి, అంజన్న, కృష్ణారెడ్డి, గాల్ రెడ్డి, బిక్షపతి, రమేష్, దేవరాజ్, కమలాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, రియల్ ఎస్టేట్ శామ్, అశోక్ రెడ్డి, సుదర్శన్ తదితరులు డాక్టర్ పొందిన వేణుగోపాలను అభినందించారు.