ఆర్మూర్, మే 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలో బీజేపీ ఆర్మూర్ మండల కార్యవర్గ సమావేశం శనివారం ఆర్మూర్ మండల అధ్యక్షులు తొర్తి రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ కన్వీనర్ పాలెం రాజు, జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, అలాగే 2018 ఎన్నికల హామీలు నిరుద్యోగులకు ప్రతినెలా నిరుద్యోగ భృతి 3016, అలాగే డబుల్ బెడ్ రూంలు 10 సంవత్సరాల కాలంలో ఆర్మూర్ మండలంలో ఎంతమందికి ఇచ్చారు అని ప్రశ్నించారు. అలాగే రైతులకు ఇస్తానన్న లక్షరూపాయలు రుణ మాఫీ ఇంతవరకు చేయలేదని, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 90 శాతం సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పది వేల చొప్పున నష్టపరిహారం అందించాలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రకటించినా కానీ ఇంతవరకు నష్ట పరిహారాన్ని రైతులకు అందించలేదని ఆందోళన వ్యక్తం చేశారుర. నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ఆర్మూర్ మండల కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది.
సమావేశంలో ఆర్మూర్ మండల ప్రధాన కార్యదర్శి రవిగౌడ్, మండల ఉపాధ్యక్షులు రాజేందర్, శ్రీనివాస్, మోర్చల అధ్యక్షులు నరేష్‌చారి, విఘ్నేశ్వర్ గౌడ్, సుభాష్, లోకి నర్సారెడ్డి, జిల్లా బీసీ మోర్చ ఉపాధ్యక్షుడు బాస సురేష్, దేగాం మాజీ ఎంపిటిసి యాదగిరి, మారు గంగారెడ్డి, లోక రాంరెడ్డి, కట్ట సాయిరెడ్డి, రమేష్, రాకేష్, సతీష్, ప్రణీత్ గౌడ్, గంగాధర్, మల్లయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.