ఆర్మూర్, మే 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సంఘం భవనంలో విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోధన్ డివిజన్ ఏసిపి కిరణ్ కుమార్ హాజరై మాట్లాడారు.
ఇప్పటినుంచి తమ లక్ష్యం ఎంచుకొని లక్ష్యం కోసం నిరంతరం కష్టపడాలని సూచించారు. విద్యార్థులు మంచి చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు జ్ఞాపకాలు అందజేసి ఘనంగా సన్మానించారు.
అనంతరం ఏసీబీ కిరణ్ కుమార్కు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. మొత్తం 31 మందికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు గద్దె గంగాధర్ జిల్లా కార్యదర్శి రాజారం డివిజన్ కార్యదర్శి సత్యనారాయణ కోశాధికారి నటరాజ్ జిల్లా మరియు డివిజన్ కార్యవర్గ సభ్యులు తదితరులున్నారు.