కామారెడ్డి, మే 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు తల సేమియా వ్యాధితో బాధపడుతుండడం జరుగుతుందని వారికి ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని ప్రముఖ సామాజిక సేవకులు, ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సహకారంతో తల సేమియా చిన్నారుల కోసం 5 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరుగుతుందని, దానిలో భాగంగానే గడిచిన 6 నెలలలోనే ఒక వేయి 73 యూనిట్ల రక్తాన్ని సేకరించి వారికి అందజేయడం జరిగిందన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శ్యామల (26) గర్భిణీ స్త్రీకి ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ప్రభుత్వ రక్తనిధి కేంద్రంలో వారికి కావాల్సిన రక్తం లభించకపోవడంతో సంగోజివాడి గ్రామ ఉప సర్పంచ్ శివాజీ రావు మానవతా దృక్పథంతో సకాలంలో రక్తనాన్ని అందచేసి ప్రాణాలను కాపాడడం జరిగిందని రక్తదానం చేసిన రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరపున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్, టెక్నీషియన్లు చందన్, ఏసు గౌడ్ పాల్గొన్నారు.