పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి

నిజామాబాద్‌, మే 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకరంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ సందర్భంగా అనేక వర్గాల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకొచ్చింది. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎదుర్కొంటున్న, దీర్ఘకాలంగా పెండిరగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

మూడు డిఏలు పెండిరగ్లో ఉన్నాయని, పిఆర్‌సి కమిటీ కాలపరిమితి ముగిసిందని కొత్త పిఆర్సిని ఏర్పాటు చేయాలని, ఈ కుబేర్‌లో పెండిరగ్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా తక్షణమే చెల్లించాలని, ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ పటిష్టపరిచి నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆస్పత్రిలో అనుమతించాలని వారు డిమాండ్‌ చేశారు.

మొదటి తారీకునే పించను అందే విధంగా చర్యలు తీసుకోవాలని, కమిటేషన్‌ వాల్యూ ఆఫ్‌ పెన్షన్‌ను 15 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలకు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్మోహన్‌, కోశాధికారి ఈవిల్‌ నారాయణ, జిల్లా నాయకులు, జార్జ్‌ ప్రసాదరావు, రాధా కిషన్‌, సుదర్శన్‌ రాజ్‌ ముత్తారం నరసింహస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »