ఆలూరు, జూన్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలోని ఇందిరమ్మ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. సుమారు ఆరు లక్షల వరకు చోరీ జరిగినట్టు బాధితులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఆలూర్ మండలంలోని ఇందిరమ్మ కాలనీలో తాళం వేసిన ఇంట్లో రాత్రి సుమారు రెండు గంటల సమయంలో దొంగతనం జరిగి ఉండొచ్చని బాధితులు కత్తుల చిన్న గంగాధర్ భార్య సత్యగంగు తెలిపారు.
వాళ్ళు ఇంటిపైన నిద్రిస్తున్న సమయంలో దొంగతనానికి పాల్పడ్డారని 8 తులాల బంగారం, 25 వేల రూపాయలు వాళ్ల కుమారుడి పాస్‌పోర్ట్, ప్రాసరి నోట్స్, బ్యాంక్ అకౌంట్స్, పొలం పట్టా పాస్ బుక్‌లను చోరీ చేశారని బాధిత కుటుంబం వాపోయారు. ఎస్సై శివరాం ఇంటిని పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.