బీబీపేట్‌లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

దోమకొండ, జూన్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండల కేంద్రంలో మండల రైతుబంధు సమితి ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి మండల రైతుబంధు సమితి అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరించారు.

అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల రైతుబంధు సమితి అధ్యక్షులు నాగరాజ్‌ గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకరమైన రోజని ఎన్నో ఏళ్ల పాటు వివక్షకు గురైన తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రం సాధించుకున్న రోజని ఉద్యమానికి రాష్ట్ర చరిత్రలో ప్రాముఖ్యత కలిగిన రోజని ఇవాల్టితో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు.

ఎంతోమంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పడిరదని నీళ్లు, నిధులు,నియామకాలు నినాదంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిరదన్నారు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో నీళ్లు,నిధులు నినాదం పూర్తయ్యాయని ఈ మధ్యనే ఉద్యోగాల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం వేసిన ఉద్యోగ నోటిఫికేషన్‌లతో పెద్ద మొత్తంలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయన్నారు.

రైతుల కోసం దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతుబంధు,రైతు బీమా, ఉచిత కరెంటు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ గారికే దక్కిందన్నారు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు కామరెడ్డి నియోజకవర్గంలో లబ్ధిదారులకు సకాలంలో అందే విధంగా ప్రభుత్వ గంప గోవర్ధన్‌ నిరంతరం ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ బాలామణి, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, తహసిల్దార్‌ నర్సింలు, మండల బిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు వెంకట్‌ గౌడ్‌, స్థానిక సర్పంచ్‌ తేలు లక్ష్మీ సత్యనారాయణ, ఎంపీటీసీలు దుంప పల్లవి భూమేష్‌, కోరివి నీరజ నర్సింలు, ఆర్‌ఐ అజయ్‌, ఉపసర్పంచ్‌ సాయినాథ్‌, మండల కో ఆప్షన్‌ సభ్యులు ఆసిఫ్‌ సింగల్‌ విండో డైరెక్టర్లు దేవునిపల్లి శ్రీనివాస్‌, నరేందర్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు కాశాగౌడ్‌, మురళి, బాగాగౌడ్‌, హన్మంత్‌ రెడ్డీ, సిద్దయ్య, పోచయ్య, నీరడి వెంకటేష్‌, వార్డు సభ్యులు, రైతుబంధు సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »