బాన్సువాడ, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యా బోధన చేపట్టడం జరుగుతుందని బోర్లం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ అన్నారు. శనివారం బోర్లం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి బోర్లామ్, బోర్లం క్యాంప్, జేకే తండా గ్రామాలలో ఇంటింటికి ఉపాధ్యాయ బృందం తిరుగుతూ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యతను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు.
ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యతోపాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచిత పుస్తకాలు అందించడం జరుగుతుందని, ప్రైవేటు పాఠశాలలో చేర్పించడం ద్వారా డబ్బు వృధా చేసుకోవద్దని ఆయన విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.
బడి బయట పిల్లలు గుర్తించి సమీప పాఠశాలలో విద్యార్థులను చేర్పించి వారి భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, ఉపాధ్యాయులు సరిత,శిరీష,సందీప్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.