నిజామాబాద్, జూన్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జి. వైజయంతి, నిజామాబాద్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి. లక్ష్మీనర్సయ్య ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయ సేవాసదన్ హాలులో నిజామాబాద్ డివిజిన్‌లోని పోలీసు అధికారులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రహీమొద్దీన్ శిక్షణ తరగతులు నిర్వహించారు.
శిక్షణలో ఎఫ్‌ఐఅర్ నుండి చార్జ్ షీట్‌లో జరుగుతున్న లోపాలు, ఏ రకమైన ఆధారాలు సేకరించాలో, పిఓసిఎస్‌ఓ చట్టం గురించి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల వివరించారు.
కార్యక్రమంలో జిల్లా న్యాయసేవ ఆధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, మొదటి ఎడిజే కనకదుర్గ, రెండవ ఏడిఎం గోపికృష్ణ, డిష్యటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి. లక్ష్మీనర్సయ్య, వివిధ అంశాలపై కూలంకుశంగా వివరించారు.