హైదరాబాద్, జూలై 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో వివిధ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) తొలివిడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 15 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశమున్నది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 చెల్లించాలి.
ఈనెల 3 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా 105 హెల్ప్‌లైన్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు ఈనెల 13న వికలాంగులు, క్యాప్, 14న ఎన్‌సీసీ, ఎక్స్‌ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్న వారికి విశ్వవిద్యాలయాల్లోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఈనెల 22న తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుంది.