నందిపేట్, జూలై 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని గ్రామాలలో ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచుల అధ్యక్షతన గురువారం ప్రారంభమయింది. గ్రామాల్లో ఇది వరకె ఉపాధి కూలీల ద్వారా తవ్వించి సిద్ధంగా ఉంచిన గుంతలలో ప్రజా ప్రతినిధులు అధికారులు మొక్కలు నాటి నీరుపోశారు.
డొంకేశ్వర్ గ్రామ సర్పంచ్ ఛాయా చందు, ఎంపిటిసి శ్రీకాంత్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలను నందన వనంగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో సిఎం కెసిఆర్ హరిత హారం కార్యక్రమం ప్రారంభించారని కొనియాడారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని కాపాడాలని కోరారు. టిఆర్‌ఎస్ నాయకులు, వార్డు సభ్యులు, విడిసి సభ్యులు పాల్గొన్నారు.