ఆర్మూర్, జూన్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గోసంగి సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజక వర్గం చేపుర్ గ్రామ గోసంగి కుల సంఘ భవన్‌లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గోసంగి సంఘం జిల్లా కార్యదర్శి అంకమొల్ల శంకర్ మాట్లాడుతూ గోసంగి కులానికి మల్లె సాయి చరన్‌కి ఎలాంటి సంబంధం లేదని, అలాగే గంధం రాజేష్ చేసిన ఆరోపనలు వాస్తవంకాదని ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని వారన్నారు.
గోసిక, గోసంగి అన్న ఒకటే అని తెలియక పోవడం దురదరుష్టకరమని వాపోయారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు గమనించాలని వారు ఈ సందర్బంగా కోరారు. వాస్తవం చెప్తున్నాము, చర్చకు సిద్దమే అని, ఇలాంటి లేని ఆరోపణలు చేస్తే ఉరుకోమని ఖబ్ధర్ అని హెచ్చరించారు. గోసంగి కులస్తులు యాదవ రాజుల దగ్గర సైనికులుగా, సైనిక అధ్యక్షులుగా, గో సంరక్షకులుగా పనిచేసిన గొప్ప చరిత్ర ఉందని, కాలక్రమేన గ్రామ సుంకరులుగా వ్యవసాయ దారులుగా గీతా కార్మికులుగా మారడం జరిగిందన్నారు.
బుడగ జంగం అనే కులం గేజిట్‌లో లేక గోసంగి కుల సర్టిపికెట్ తీసుకుంటున్నారన్నారు. నేడు బుడగ జంగం గెజిట్‌లో వచ్చినకూడ వారి సర్టిఫికెట్ మార్చుకోవడంలేదని, ఇన్ని రోజులు సాటి దళిత సోధరులని సామరస్యంగా పరిష్కారం చేసుకుందామని, ఇక ఉద్యమం ఉవ్వెత్తన లేస్తుంది అని అక్రమంగా తీసుకున్న గోసంగి కుల సర్టిఫికెట్లు రద్దు అయ్యేదాకా మీ కుల సంఘ భవనాలకు గోసంగి బోర్డు తొలగించ్చేంతవరకు ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఒక్క నిజామాబాద్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గోసంగి బిడ్డ ఉద్యమానికి కదులుతున్నామన్నారు. జిల్లా కలెక్టర్ డీఎల్‌ఎస్ కమిటి వేసి నిజమైన గోసంగులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అంకమల్ల శంకర్, కుమ్మరి గంగామల్లేశ్, అంకమల్ల వెంకటేశ్, కుమ్మరి సత్తయ్య, అంకమల్ల లక్ష్మణ్, కుమ్మరి గంగాధర్, కొంకి గంగారాం, కడాసి ప్రవీన్, సిర్ర మల్లేశ్, తోటపల్లి దేవరాజు, జన్నారం రాకేశ్, తోటపల్లి నర్సింగ్, రాయికంటి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.