గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం

నిజామాబాద్‌, జూన్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్మాణాలతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్‌ గ్రామంలోని రిజర్వా యర్‌ నిర్మాణ ప్రాంతంలో దశాభ్డి ఉత్సవాలో భాగంగా సాగునీటి దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమానికి శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి , నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ వీ పాటిల్‌, జిల్లా అటవీ శాఖాధికారి వికాస్‌ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదేళ్లలోకి అడుగిడిన సందర్భంగా ఒక్కొక్క రంగంలో సాధించిన పురోగతిని గుర్తించేందుకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.

దశాబ్ది ఉత్సవాల్లో 6వ రోజులో భాగంగా సాగునీటి దినోత్సవం సందర్భంగా సిద్దాపూర్‌ లో సాగునీటి రిజర్వాయర్‌ నిర్మాణం ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని కోసం సభాపతి పోచారం, ఇంజనీరింగ్‌ అధికారులు, డిఎఫ్‌ఓతో కలిసి రెండు నెలల క్రితం ఈ ప్రాంతాన్ని సందర్శించామన్నారు. అయితే రిజర్వాయర్‌ నిర్మాణంకు 500 ఎకరాల భూమి అవసరం ఉండడంతో అంతా అటవీ శాఖ భూమి ఉండడంతో వారి అనుమతి కోరగా వారు 500 ఎకరాల రెవెన్యూ భూమి ఇవ్వాలని అడగడంతో భూమి నీ గుర్తించి అప్పగించామని టెక్నికల్‌ పనులు జరుగుతున్నాయన్నారు.

సాగునీటి దినోత్సవం ఇంజనీరింగ్‌ అధికారులు సాధించిన పురోగతిలో వారి భాగస్వామ్యం ఉన్నదని కలెక్టర్‌ కొనియాడారు. తొమ్మిదేళ్లు కష్టపడితే ప్రతి ఫలాలు అందాయన్నారు. మిషన్‌ కాకతీయలో పనుల ద్వారా వాటర్‌ ట్యాంక్‌ లు, చెక్‌ డ్యాంలు నిర్మించారన్నారు. ప్యాకేజ్‌ 20, 21,22 పనులు చేపట్టామన్నారు. ఎస్సాఆర్‌ ఎస్పీ పునర్జివన పథకం ద్వారా ముప్కాల్‌ లో పంప్‌ హౌస్‌ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో ఇరిగేషన్‌ ద్వారా రూ.5800 కోట్ల ప్రాజెక్ట్‌ పనులు అనుమతి రాగా రూ. 4800 కోట్ల పనులు పూర్తయ్యాయన్నారు. 2014లో వరి పంట సాగులో 24 స్థానంలో ఉన్న తెలంగాణ, ప్రస్తుతం దేశంలో రెండవ స్థానంలో ఉందని కలెక్టర్‌ తెలిపారు. యాసంగిలో దేశంలో 94 లక్షల ఎకరాల్లో వరి పంట పండిరచగా తెలంగాణలో 54 ఎకరాల్లో వరి పంట పండిరచారు.సాగు నీటి లభ్యత ఉంది కాబట్టి వరి పంట పండిరచగలిగామన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా గ్రౌండ్‌ వాటర్‌ పెరగడంతో భూగర్భ జలాలు పైకి వచ్చాయన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »