సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

వేల్పూర్‌, జూలై 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం సాహెబ్‌ పేట్‌ గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును గ్రామ సర్పంచ్‌ సుధాకర్‌ గౌడ్‌ ఉపసర్పంచ్‌ లక్ష్మణ్‌ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న శకుంతల పరిస్థితి బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం 18 వేల రూపాయల చెక్కు మంజూరు చేశారన్నారు.

ఇట్టి చెక్కులను రైతులకు గురువారం అందజేసినట్టు తెలిపారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పద్మ, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »