పల్లెప్రగతిలో మంత్రి, కలెక్టర్‌…

వేల్పూర్‌, జూలై 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వేల్పూరు మండల కేంద్రంలో జంబి హనుమాన్‌ వద్ద బతుకమ్మ పార్కు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామంలో అన్ని వసతులు కల్పించడమే ద్యేయంగా గ్రామాన్ని సుందరీకరణ చేసేందుకు శాయ శక్తుల కృషి చేస్తున్నామని, అదే విధంగా గ్రామంలో సెంటర్‌ లైటింగ్‌తో పాటు పార్కులలో చిన్నారుల కోసం అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాలలో ఇంటి ముందు ఆరు చెట్లను పెంచుకోవాలని సూచించారు.

సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి ఎప్పటికీ మరువలేనిదన్నారు. బాధ్యతగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు క ృతజ్ఞతలు తెలిపారు. సభలో పాల్గొన్న టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు జిల్లా స్థాయి అధికారులకు గ్రామ ప్రజలకు తన తరపున కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »