వేల్పూర్, జూలై 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ఏనుగు శ్వేతా గంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలో శాఖల వారీగా ఏ అవసరాలు ఉన్నాయి అనేదానిపై సంబంధిత అధికారులతో చర్చించారు. గ్రామంలో ఇప్పటివరకు గుర్తించిన పనులను సర్పంచ్ శ్వేతా గంగారెడ్డి చదివి వినిపించారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు, అధికారులు, అనధికారులు పాలుపంచుకొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ప్రజా అవసరాలు ఏమేమి ఉన్నాయి అన్నదానిపై క్షేత్రస్థాయిలో గ్రామంలో తిరిగి తెలుసుకున్నారు.