హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం

రెంజల్‌, జూన్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నిర్వహించ తలపెట్టిన గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ప్రతిగ్రామంలో పర్యటించడం కొరకు గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని రెంజల్‌ మండలంలోని నీలా,కందకుర్తి గ్రామాల్లో ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు.

గ్రామాల్లో నేరుగా పర్యటించి ప్రజాసమస్యలపై తెలుసుని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల హామీలు నెరవేరుస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ రైతుల రుణమాఫీ, నిరుద్యోగ జీవనభృతి, ఉచిత కరెంటు పథకాలలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతులకు అరుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీ దేనని అన్నారు కాంగ్రెస్‌ పార్టీ రైతులకు నిరుద్యోగులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని నేడు ప్రత్యేక రాష్ట్ర సాధనలో రైతులు నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు.

రానున్న ఎన్నికల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్‌ పార్టీకి సాటి ఎవ్వరు లేరని తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని రకాల హామీలను నెరవేర్చడంలో ముందుంటామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి, అంతిరెడ్డి రాజారెడ్డి, మండల అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌,సీ హెచ్‌ రాములు,సాయరెడ్డి,జావిదొద్దీన్‌,మహిపాల్‌ రెడ్డి,బాబు,తదితరులు ఉన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 బుధవారం, డిసెంబరు 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »